న్యూ ఇయర్ వేళ .. కామారెడ్డిలో విషాదం

0 8,134

కామారెడ్డి, బతుకమ్మ :  కామారెడ్డి  జిల్లా కేంద్రంలో న్యూ ఇయర్ వే
ళ విషాదం నెలకొంది.   కలెక్టర్ కార్యాలయ సమీపంలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొని యువకుడు దుర్మరణం చెందాడు. ఈఘటన గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. రామారెడ్డి మండలం రెడ్డిపేట్ కు  చెందిన గోపు నరేశ్ (30)  కామారెడ్డి పట్టణంలో నివాసం ఉంటున్నాడు. ప్రస్తుత భిక్కనూరు సర్పంచ్ కూతురితో నరేశ్ కు ఏడాది క్రితం వివాహం జరిగింది. ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో ఉంటుండగా, న్యూ ఇయర్ సందర్భంగా కామారెడ్డికి వచ్చాడు.  గుమాస్తా కాలనీ నుంచి ఇంటికి వెళ్తుండగా  కలెక్టరేట్ సమీపంలోని జయశంకర్ కాలనీ  వద్ద కారు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈఘటనలో నరేశ్  అక్కడికక్కడే మృతి చెందాడు. కారు స్టీరింగ్ సరిగ్గా పనిచేయకపోవడంతోనే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.