నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నగరంలోని అంబేద్కర్ కాలనీలో పట్టపగలే ఇంటి ఎదుట పార్కింగ్ చేసిన బైక్ చోరికి గురైంది. కాలనీకి చెందిన ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి మధ్యాహ్నం ఇంటి ఎదుట బైక్ పార్క్ చేసి ఇంట్లోకి వెళ్లాడు. సాయంత్రం 4:40 నిమిషాలకు ఇంటి ముందు నిలిపిన బైక్ కనిపించకపోవడంతో చుట్టుప్రక్కల వెతికినా దొరకలేదు. దీంతో స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా గుర్తు తెలియని వ్యక్తి బైక్ ను ఎత్తుకెళ్తున్నట్లు సీసీటీవీలో రికార్డయ్యింది. ఈ మేరకు బాధితుడు ప్రవీణ్ కుమార్ 3వ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.