కబ్జాలో ఆకుల రాఘవేంధర్, గడీల రాముల హస్తం ఉన్నట్లు ఫ్లెక్సీల ఏర్పాటు
నిజామాబాద్, బతుకమ్మ:
నిజామాబాద్ రూరల్ మండలంలోని కాలూర్, కొండూర్ శివారులోని నల్ల పోచమ్మ (కురుమ శంకర్ ఆలయం) ఆలయానికి చెందిన భూమి కబ్జాకు గురైంది. నిజామాబాద్ కు చెందిన అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆకుల రాఘవేంధర్ (మాజీ ఎమ్మెల్సీ భర్త), గడీల రాములు (మాజీ ఒలంపిక్ సంఘం ప్రెసిడెంట్) కబ్జా చేశారని గ్రామస్థులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో కాంగ్రెస్ నాయకులు అగ్గు భోజన్న విలేకరులతో మాట్లాడుతూ సర్వే నెంబరు 109లో 12 ఎకారాల 13 గుంటలు వ్యవసాయ భూమి ఉందన్నారు. అందులో 33 గుంటలు గత కొన్ని సంవత్సరాలుగా నల్ల పోచమ్మ ఆలయానికి కేటాయించారని తెలిపారు. సంబంధిత 33 గుంటల భూమిని ఆకుల రాఘవేంధర్, గడీల రాములు ఇద్దరూ కలిసి చెరోసగం కబ్జా చేశారని తెలిపారు. ధరణి పోర్టల్ వచ్చేసరికి సంబంధిత భూమిపై ఎవరికీ హక్కులు లేవని ఇద్దరు నాయకులు వాటిని తమ పేర్లపై మార్పించుకుని కబ్జా చేశారని చెప్పారు. సంబంధిత భూమిని కబ్జా నుంచి వడిపించాలని అధికారులను కోరారు. ఇప్పటికే ప్రజావాణిలో ఫిర్యాదు చేశామని, భూమి కోసం రెండు గ్రామాల ప్రజలు పోటారం చేస్తామని వెల్లడించారు.

