. . . అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ధ చెరువులో లో ఎస్ఐ డేడ్ బాడి లభ్యం
కామారెడ్డి/ బిక్కనూర్, బతుకమ్మ:
రాష్ట్రం లో సంచలనం రేపిన బిక్కనూర్ ఎస్ఐ సూసైడ్ కథ విషాదాంతమైంది. కామారెడ్డి జిల్లా బిక్కనూర్ ఎస్ ఐ సాయి కుమార్ (31 ) కామారెడ్డి శివారులోని అడ్లుర్ ఎల్లారెడ్డి పెద్ధ చెరువులో గురువారం ఉదయం విగత జీవిగా గజఈతగాళ్లు వెలికి తిశారు. బుదవారం రాత్రి నుంచి పోలిస్ శాఖ పెద్ధ చెరువులో రెస్క్యూ ఆఫరేషన్ చెపట్టిన విషయం విధితమే. బిక్కనూర్ ఎస్సై సాయి కుమార్ (31), బిబి పేట్ పోలిస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న శ్రుతి ( 32), బిబి పేట్ లో సోసైటిలో కంప్యూటర్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్న నిఖీల్ (28) లు బుదవారం మధ్యహ్నమే పెద్ధ చెరువులొ దుకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉదయం 11 గంటల తరువాత ఎస్ఐ పోన్ స్విచ్చాఫ్ రావడం, విధులు నిర్వహించుకుని ఇంటికి వేళ్లిన కానిస్టెబుల్ శ్రుతి పోన్ స్విచ్చాప్ రావడంతో పోలిసులు టవర్ లోకేషన్ ద్వార ఇద్ధరు కుడా పెద్ధ చెరువు వద్ధ కలిసినట్లు గుర్తించారు. అక్కడ ఎస్ఐ కి సంబందించిన కారు లభ్యమైన సెల్ పోన్ దోరకలేదు. అది స్విచ్చాప్ రావడం అక్కడ నిఖీల్, శ్రుతికి సంబందించిన సెల్ పోన్, చెప్పులు ఇతర సామాగ్రీ గుర్తించారు.

రాత్రే దోరికిన ఇద్ధరి డేడ్ బాడిలు….
రాత్రి తోమ్మిది గంటల ప్రాంతంలో పెద్ధ చెరువులో ఎస్ ఐ, కానిస్టెబుల్, మరోకరి సూసైడ్ కేసులను చేదించేందుకు కామారెడ్డి ఎస్పీ సిందు శర్మ అధ్వర్యంలో పోలిస్ శాఖ రిస్క్యూ ఆఫరేషన్ చేపట్టారు. రాత్రే శ్రుతి, నికిల్ డేడ్ బాడిలు లభ్యమయ్యాయి. కాని ఎస్ ఐ డేడ్ బాడి దోరక్కపోవడంతో మిస్టరిగా మారింది. గురువారం తెల్లవారు జామున గాలింపు చర్యలు చెపట్టగా ఎస్సై డెడ్ బాడి దోరక్కడంతో ముగ్గురి ఆత్మహత్యగా నిర్థారణ అయింది.

ముగ్గురి ఆత్మహత్య . . .
మెదక్ జిల్లా కోల్చారం కు చెందిన ఎస్ఐ సాయి కుమార్ కామారెడ్డి జిల్లాలో గతంలో బిబిపేట్ లో ఎస్సైగా పనిచేసినప్పుడు కానిస్టెబుల్ శ్రుతితో ఎర్పడిన పరిచయం వివాహేతర సంబందంకు దారి తీసినట్లు అనుమానిస్తున్నారు. గాందారి మండలంకు చెందిన కానిస్టెబుల్ శ్రుతికి ఇదివరకే వివాహం జరిగిన విడాకులు తీసుకున్నట్లు తెలిసింది. బిబిపేట్ కు చెందిన నిఖిల్ అవివాహితుడు. కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసే నిఖిల్ ఎస్ఐ గా సాయి కుమార్ బిబిపేట్ లో పనిచేసినప్పుడు పరిచయం ఎర్పడిందని సమాచారం. ముగ్గురు అత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కానిస్టెబుల్ శ్రుతి ఓంటిపై గాయాలు ఉండటంతో అవి ఎక్కడివి అనే కోణంలో పోలిసులు ఆరా తీస్తున్నారు. ఈ నెలలో ఖమ్మం జిల్లా వాజేడు ఎస్ఐ తన సర్విస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే బిక్కనూర్ ఎస్ఐ బలవన్మరణం కలకలం రేపుతోంది.
