రోడ్డు ప్రమాదంగా చిత్రికరించే యత్నం
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలో శుక్రవారం ఉదయం ఒక యువకుడి హత్య జరిగిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. కామారెడ్డి జిల్లా మద్నూర్ కు చెందిన లక్ష్మణ్ ( 28) అనే యువకుడు గాయాలతో దుబ్బలోని కాలుర్ చౌరస్తా వద్ధ గల ఎస్ విడి వైన్స్ ముందు పడి ఉన్నాడు. ఉదయం వేళ స్థానిక మూడవ టౌన్ సిబ్బంది అతనిని జిల్లా అసుపత్రికి తరలించగా రెండు గంటల పాటు చికిత్స పోందుతూ ఆసుపత్రిలో చనిపోయారు. మృతదేహాన్ని మార్చూరీ గదికి తరలించారు. సంఘటనా స్థలంలో టౌన్ సిఐ శ్రీనివాస్ రాజు, మూడవ టౌన్ ఎస్ఐ డాగ్ స్క్వాడ్ దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి తలపై ఉన్న గాయాలతో అతడిది హత్యగా గుర్తించారు. గాయాల తీవ్రత రాత్రి వేళ కావడంతో అందరిని రోడ్డు ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. రాత్రి వైన్స్ వద్ధ, చుట్టు ప్రక్కల ఉన్న సిసి కేమోరాలను పరిశీలిస్తున్నారు.

