24 C
Hyderabad
Sunday, August 2, 2026

ఆన్ లైన్ సెంటర్లను పరిశీలించిన సబ్ కలెక్టర్

Must read

📰 Generate e-Paper Clip

బోధన్, బతుకమ్మ : బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో సాలూర, బోధన్ మండలాల్లో ఎంపిక చేసిన ఆన్ లైన్ సెంటర్లను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడారు.  ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర కుటుంబాల సర్వేను ఎప్పటికప్పుడు కంప్యూటర్లలో నమోదు చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. 9వ తేది నుంచి  ఎన్యూమరేటర్లు సర్వేచేసిన కుటుంబాల వివరాలను ఎప్పటికప్పుడు కంప్యూటర్లలో నమోదు చేయాలని సూచించారు.  సర్వే చేసిన వివరాలు నమోదు చేయడానికి కంప్యూటర్లు సిద్దంగా ఉన్నాయా లేవా అంటు నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.ఎలాంటి పొరపాట్లు జరగకుండా కంప్యూటరీకరణ చేయాలని ఆయన ఆన్ లైన్ సెంటర్ల నిర్వాహకులకు సూచించారు.ఆయన వెంట సాలూర తహశీల్దార్ శశిభూషణ్, మున్సిపల్ కమీషనర్ వెంకటనారాయణ,  ఆన్ లైన్ సెంటర్ నిర్వాహకులు కృష్ణ ఉన్నారు.

More articles

Latest article