బతుకమ్మ, దుబ్బాక ప్రతినిధి : సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు స్థానిక తల్లి తెలంగాణ చౌరస్తా వద్ద ఘనంగా నిర్వహించడం జరిగిందని దుబ్బాక మండల అధ్యక్షులు కొంగరి రవి అన్నారు.ఈ సందర్బంగా కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాలలో ముందుకు సాగుతుందన్నారు.బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్న గొప్ప నాయకుడు రేవంత్ రెడ్డి అని కొనియాడారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్న నాయకుడు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని వేడుకుంటున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో హామీలన్నింటిని ఒక్కొక్కటిగా నెరవేరుస్తారని ధీమా వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అతి తక్కువ కాలంలోనే పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ మరియు మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు, ఎస్సీ సెల్, బీసీ సెల్, సోషల్ మీడియా కోఆర్డినేటర్, మున్సిపల్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.
