24 C
Hyderabad
Sunday, August 2, 2026

ఏఎంసీ చైర్మన్ గా ముప్ప గంగారెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

. రైతు నాయకుడికి అవకాశం

. రాజకీయ జీవితమంతా కాంగ్రెస్ తోనే..

నిజామాబాద్, బతుకమ్మ: రైతు నాయకుడు ముప్ప గంగారెడ్డి నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమితులయ్యారు. ఈ మేరకు వ్యవసాయ సహకార శాఖ కార్యదర్శి రఘునందన్ రావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వైస్ చైర్మన్ గా జంగిటి రాంచందర్ తోపాటు 11 మంది డైరెక్టర్లను నియమించారు. రాజకీయ జీవితం ప్రారంభం నుంచి కాంగ్రెస్ లోను కొనసాగుతున్న ముప్ప గంగారెడ్డికి తగిన గుర్తింపు లభించిందని పార్టీ శ్రేణులు హర్షిస్తున్నాయి.

పాలకవర్గం ఇదే..

ముప్ప గంగారెడ్డి (చైర్మన్), జంగిటి రాంచందర్(వైస్ చైర్మన్), డైరెక్టర్లుగా ఐల రాజలింగం, యెన్నం బాగారెడ్డి, దండ్ల రాజన్న, మెదావత్ మంగిత్యా, జి గంగారెడ్డి, వంగల దేవకరుణ, పెంట ఇంద్రుడు, సైనేని వెంకటేశ్వరరావు, కౌడపు రఘువీర్, మహ్మద్ ఎసా, జోగిని మల్లేశ్, అలిగటి నరేందర్ నియమితులయ్యారు. వీరితోపాటు ఇద్దరు ట్రేడర్లు, నలుగురు ఎక్స్ అఫీషియో మెంబర్లను కార్యవర్గంలో నియమించారు.

సొసైటీ డైరెక్టర్ నుంచి ముప్ప పయనం..

ముప్ప గంగారెడ్డి 1987లో బాడ్సి సొసైటీ డైరెక్టర్ గా పని చేశారు. 1988 లో ముదక్ పల్లి-నర్సింగ్ పల్లి సర్పంచ్ గా, 1995లో ముదక్ పల్లి – నర్సింగ్ పల్లి ఎంపీటీసీగా విజయం సాధించి వైస్ ఎంపీపీగా పని చేశారు. 2005 – 14 వరకు సింగిల్ విండో చైర్మన్, డీసీసీబీ డైరెక్టర్ గా ఉన్నారు. జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా పని చేసిన ఆయన 2015 నుంచి కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

 

More articles

Latest article