నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వినియోగించి హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆలయాల పరిరక్షణ సమితి అధ్యక్షుడు పటేల్ ప్రసాద్ అన్నారు. దీనిపై వెంటనే విచారణ చేపట్టి ఆంధ్రపదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో శనివారం ఏపీ మాజీ సీఎం జగన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో స్వామి, ప్రవీణ్, బంటూ రామరాజు,అజయ్, రవి, సాయిప్రసాద్, ఆలయాల పరిరక్షణ సమితి నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
