26.3 C
Hyderabad
Monday, August 3, 2026

వాలీబాల్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

 

బాన్సువాడ, బతుకమ్మ :

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థాయి సీనియర్ మహిళా , పురుషుల వాలీబాల్ టోర్నమెంట్ 2025 ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. బాన్సువాడ పట్టణ పరిధిలోని ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియంలో సోమవారం టోర్నీ ప్రారంభించిన పోచారం మాట్లాడుతూ…. క్రీడలు యువత మానసికోల్లాసాన్ని  కలిగిస్తాయని అన్నారు. క్రీడా స్పూర్తిని చాటుతు  విద్యార్థులు క్రీడల్లో పాల్గొనాలని కోరారు.  ఈ సందర్భంగా నిర్వహకులు పోచారం శ్రీనివాస్ రెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా వాలీబాల్  అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మల్లేష్ గౌడ్ బాన్సువాడ యంఈవో నాగేశ్వర్ రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, సొసైటీ చైర్మన్ ఎర్వా కృష్ణారెడ్డి, కామారెడ్డి జిల్లా మైనారిటీ అధ్యక్షులు అబ్దుల్ ఖాలేఖ్, మాజీ ఎంపీపీ మహమ్మద్ ఎజాస్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నార్ల సురేష్, నార్ల రవీంద్ర, నాయకులు మోహన్ నాయక్, మధుసూధన్ రెడ్డి, గోపాల్ రెడ్డితదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article