వాలీబాల్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
బాన్సువాడ, బతుకమ్మ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థాయి సీనియర్ మహిళా , పురుషుల వాలీబాల్ టోర్నమెంట్ 2025 ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. బాన్సువాడ పట్టణ పరిధిలోని ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియంలో సోమవారం టోర్నీ ప్రారంభించిన పోచారం మాట్లాడుతూ.... క్రీడలు యువత మానసికోల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు. క్రీడా స్పూర్తిని చాటుతు విద్యార్థులు క్రీడల్లో పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా నిర్వహకులు పోచారం శ్రీనివాస్ రెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో...