నిజామాబాద్, బతుకమ్మ : బీసీలకు 42 శాతం విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని బీఎల్పీ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. అంతకు ముందు ధర్నా చౌక్ లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం దండి వెంకట్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 2025లో బీసీ కులాల ప్రజలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో42% రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర గవర్నర్ లకు పంపి7 నెలల అవుతున్న పెండింగ్ లోనే ఉందన్నారు. ఈ నేపథ్యంలో
రాబోయే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లులను 9వ షెడ్యూల్ లో చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమండ్ చేశారు. ఈమేరకు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని నిర్ణయించామన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి యాటల అనిల్ కుమార్, బోధన్ డివిజన్ కన్వీనర్ డి. పోలిశెట్టి, జిల్లా నాయకులు చంద్రా గౌడ్, బీసీ కులాల నగర నాయకులు జె.సత్యనారయణ, కె.సుభాష్, బి. గోపాల్, బాల్ రాజు తదితరులు పాల్గొన్నారు.

