నిజామాబాద్ సిటి, బతుకమ్మ :
తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులుగా నియమితులైన గడుగు గంగాధర్ ను వాకర్స్ అసోసియేషన్ ఘనంగా సన్మానించారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ రాం చందర్ ఆధ్వర్యంలో సోమవారం పాలిటెక్నిక్ గ్రౌండ్ లో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులుగా ఎన్నికైనటువంటి గడుగు గంగాధర్ ని శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు దయాకర్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, నరాల రత్నాకర్, బొబ్బిలి రామక్రిష్ణ, సూర్య సురేష్ తదితరులున్నారు.
