27.5 C
Hyderabad
Friday, July 31, 2026

ఆలూరు లో బౌద్ధ దీపావళికి ఆహ్వానం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, ఆర్మూర్ : గౌతమ బుద్దుడు ఆరు సంవత్సరాల జ్ఞాన అన్వేషణ నుంచి స్వరాజ్యామైన కపిలవస్తుకు తిరిగి వస్తున్న కార్తీక పూర్ణిమ రోజు ప్రజలు దీపాలు వెలిగించి బుద్ధుడిని ఘన స్వాగతపర్చిన రోజే “బౌద్ధ దీపావళి” అంటూ ప్రపంచ బుద్ధిష్ట్ ప్రజలు ఉత్సవం జరుపుకుంటారు. దాని కొనసాగింపు దిశగా ఆలూరు గ్రామంలో అక్టోబర్ 31న బౌద్ధ జ్ఞాన దీపావళి జరుపుకోవాలని డాక్టర్ అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఇత్వార్ పేట్ లింగన్న ఉరఫ్ డి.ఎల్ మాలజీ ఈ సందర్భంగా సూచించారు. సోమవారం ఉదయం జిల్లా నిజమాబాద్ ఆలూరు గ్రామానికి బుద్ద విహార్ నిర్మాణ పనులను పరిశీలించడానికి జిల్లా నాయకులు, ముంబై అంబేడ్కరైట్ నేత మూలనివాసి మాలజీ ఊరి భీంరావు విగ్రహం సాక్షిగా హాజరైయ్యారు. ఆరంభంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ కు ఘన నివాళి అర్పించారు. సిద్ధార్థ గౌతముడు రైతు జాతి ముద్దు బిడ్డ. అయితే గౌతముడు జ్ఞాన ప్రాప్తితో తిరిగి వస్తున్న శుభవేళ, ఊరిలో తొలి విడత పంటలు కోతకు (ఇంటికి) వచ్చిన శుభవేళలో బుద్ధిష్ట్ పండుగ జరుపుకోవడం మంచి సాంప్రదాయం, ఈ ఉత్సవంలో ఊరి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలందరు, ముఖ్యంగా మహిళ పిల్లలతో భారీ ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డి.ఎల్ మాలజీ విజ్ఞప్తి చేశారు.

More articles

Latest article