24.7 C
Hyderabad
Monday, August 3, 2026

చివరి ఆయకట్టుకు నీరు అందేలా చర్యలు

Must read

📰 Generate e-Paper Clip

  •  పంటలు ఎండకుండా రైతులను ఆదుకుంటాం
  •  సాగునీటిని పొదుపుగా వాడుకోవాలి
  •  మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

 

బతుకమ్మ, నవీపేట్ ; చివరి ఆయకట్టుకు నీరు అందేలా ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలని, మాజీమంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. మండల కేంద్రంతో పాటు జన్నేపల్లిలోని పంటలను ఆదివారం నాడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.  ఈ సందర్భంగా పంటలను, సాగునీటిని అందించే కాలువలను రైతులతో కలిసి పరిశీలించారు.  అధికారులకు, రైతులకు పలు సూచనలు చేశారు. అధికారులు కింది ఆయకట్టుకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని, పనులలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని, అన్నదాతలు అధికారుల సూచనలు పాటించాలని కోరారు.  పంటలకు సరిపడా నీరు అందించిన తర్వాతనే చెరువులు నింపుకోవాలని సూచించారు. ముందుగా చెరువులు నింపవద్దని అధికారులను ఆదేశించారు. నీటిని వృధా చేయవద్దని కింది ఆయకట్టుకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలీసాగర్ లిఫ్ట్ కెనాల్ నుండి సాగునీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నవీపేట్ మండల నాయకులు, రైతులు పాల్గొన్నారు.

More articles

Latest article