బతుకమ్మ, బోధన్ : బోధన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంకు సంధ్య దామోదర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. 2024 ఆగస్టు 22 న చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన అంకు సంధ్య దామోదర్ రెడ్డి 2008 డీఎస్సీ ఉపాధ్యాయ అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. కొన్ని కారణాల చేత ప్రభుత్వం నియామక ఉత్తర్వుల ప్రక్రియను నిలుపగా, ఇటీవల ప్రభుత్వం నియామక ఉత్తర్వుల ప్రక్రియ ను వెలువడించడం జరిగింది. అందులో భాగంగా అంకు సంధ్యా దామోదర్ రెడ్డికి 2008 డీఎస్సీ అభ్యర్థి కావడంతో ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా ఉద్యోగం లభించడం జరిగింది. అందుకుగా ను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తూ తన రాజీనామా విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందని మార్కెట్ కమిటీ సీఈవో తెలిపారు. ఇన్నాళ్లు చైర్మన్గా తన బాధ్యతల నిర్వహణలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
