. . . ఉద్యమ బాటలో ఆర్టీసీ కార్మికులు
. . . డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె
. . . ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు
బాన్సువాడ, బతుకమ్మ :
సమ్మె సైరన్‌తో బాన్సువాడ పట్టణంలోని ఆర్టీసీ డిపోలో బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. తమ డిమాండ్ లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టడంతో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ ప్రజా రవాణా స్తంభించిపోయింది. ప్రభుత్వ చర్చలు విఫలం కావడంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఆర్టీసీ కార్మికులు తెలిపారు. ప్రభుత్వం చర్చలు ఫలించే వరకు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని కార్మికులు హెచ్చరించడంతో బస్సుల రాకపోకలు స్తంభించిపోయాయి.

. . . ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ పార్టీ సంపూర్ణ మద్దతు
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపడుతున్నారు. ఆ సమ్మెకు మద్దతుగా బాన్సువాడ ఆర్టీసీ కార్మికులకు బీజేపి పార్టీ మద్దతు తెలిపింది. ఈ సమ్మె సందర్బంగా బిజెపి పట్టణ అధ్యక్షులు కోణాల గంగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని ఆర్టీసీ కార్మికులు సకల జన సమ్మె నిర్వహించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తామని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడంతో 2019లో సమ్మె చేశారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మా పార్టీ అధికారంలోకి వస్తే ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోవడం, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకపోవడం, ప్రభుత్వంలో విలీనం చేయకపోవడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేనిచో కార్మికులు చేస్తున్న సమ్మెకు బాన్సువాడ బిజెపి నాయకులు సంపూర్ణ మద్దతు ఉంటుందని సమస్య పరిష్కరించే వరకు మేము ముందుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికుల నాయకులు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్ గజ్జల మహేష్, మాజీ జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ, మాజీ అసెంబ్లీ కన్వీనర్ గుడుగుడ్ల శ్రీనివాస్, పట్టణ ఉపాధ్యక్షులు గుడుగుట్ల అనిల్, నాయకులు చీకట్ల రాజు, పాశం భాస్కర్ రెడ్డి, సామల శ్రీకాంత్, చంద్రశేఖర్ గౌడ్, ప్రదీప్ సింగ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

