27.5 C
Hyderabad
Friday, July 31, 2026

గంజాయి విక్రేత అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

  • 300గ్రాముల గంజాయి పట్టివేత

 

బతుకమ్మ, బాన్సువాడ : బాన్సువాడ పట్టణం, బీర్కుర్ చౌరస్తా వద్ద పక్కా సమాచారం మేరకు ఎక్సెజ్ శాఖ పోలీసులు మాటువేసి మహారాష్ట్ర దెగ్లూర్ వాసి అర్జున్ బండారి అనే వ్యక్తి వద్ద 300 గ్రాముల ఎండు గంజాయితో పాటు, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సెజ్ సీఐ దిలీప్ తెలిపారు. కామారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ అధికారి సుందర్ సింగ్ తమ సిబ్బందితో పాటు బాన్సువాడ ఎక్సెజ్ సిబ్బంది సంయుక్తంగా దాడి చేసి పట్టుకున్నట్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారని గంజాయి కాని ఇతర మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని కోరారు. ప్రభుత్వం మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలపై కఠినంగా వ్యవహరిస్తుందని ఎవరైనా అమ్మిన కొన్న మాకు సమాచారం ఇవ్వాలని వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని సిఐ దిలీప్ అన్నారు.

More articles

Latest article