కామారెడ్డి, బతుకమ్మ: ఈ చిత్రాన్ని చూస్తుంటే ఏనుగు పై రాముడు శివధనస్సు చేతిలో పట్టుకొని నిల్చున్నట్టు అనిపిస్తుంది కదూ.. అలా అనుకుంటే మీరు పొరబడినట్లే… రాముడి రూపంతో ఉన్నటువంటి గణేష్ విగ్రహం ఏనుగుపై నిల్చున్న గణేష్ మహారాజ్ విగ్రహం తో పాటు పక్కనే చిన్నటి ఎలుక ఉంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత జాతీయ రహదారి పై నుండి విగ్రహం ప్రతిష్టాపనకు యువకులు టాటా ఏసీ ఆటోలో తీసుకెళ్లడంతో ప్రయాణికులు, స్థానికులు ఆసక్తిగా తిలకించారు. ఈ చిత్రాన్ని బతుకమ్మ క్లిక్ మనిపించింది.
