24.1 C
Hyderabad
Monday, August 3, 2026

బాధిత కుటుంబాలను పరామర్శించిన మానాల

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, ఏర్గట్ల: మండల పరిధిలో పలు బాధిత కుటుంబాలను బుధవారం తెలంగాణ రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి పరామర్శించారు. తడపాకల్ గ్రామానికి చెందిన జింక అనిల్ యాదవ్, జింక అన్వేష్ యాదవ్ తండ్రి మరణించిన విషయాన్ని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా తెలుసుకొని వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సోమ దేవరెడ్డి, బాల్కొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆడెం గంగా ప్రసాద్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రేండ్ల రమేష్, మాజీ జెడ్ పి టిసి గుల్లే రాజేశ్వర్, తాళ్ల రాంపూర్ బెజ్జారపు భాను, కాంగ్రెస్ మైనార్టీ మండల అధ్యక్షుడు ఎండి మునీర్, తుపాకుల శ్రీనివాస్ గౌడ్, రవిరెడ్డి, దిబ్బ శ్రీను, లింగారెడ్డి, సాంసన్, గజేందర్, రోక్కెడ సంజీవ్, కూరాకుల సాయన్న, దొబ్బల మహేష్ లు పాల్గొన్నారు.

More articles

Latest article