29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

లారీ ఢీకొని ఒకరు మృతి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, భిక్కనూరు: లారీ బైక్ ను ఢీ కొనడంతో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన భిక్కనూర్ మండలంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అక్కనపేట గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ (52) గత మూడు సంవత్సరాల నుండి జంగంపల్లి విజయసాయి లేబరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో పనిచేస్తున్నాడు. బుధవారం ఫార్మా కంపెనీలో డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్లే సమయంలో వెనకాల నుండి వచ్చిన లారీ బైకును ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న భిక్కనూరు ఎస్సై ఆంజనేయులు సంఘటన స్థలానికి చేరుకొని లారీని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

One killed in tractor-trailer collision

More articles

Latest article