. . . అంత్యక్రియలకు హాజరైన మాజీ జెడ్పిటిసి, గ్రామ సర్పంచ్
కామారెడ్డి, బతుకమ్మ :
వడ దెబ్బ తగిలి వ్యక్తి చనిపోయిన ఘటన భూంపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకునేలా చేసింది. మృతుని అన్న తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం భూంపల్లి గ్రామానికి చెందిన పసుల శ్రీనివాస్ (35) అనే వ్యక్తి కూలి పని చేసుకునేవాడు. ఎప్పటిలాగే మంగళవారం కూలీ పనికి వెళ్లి, సాయంత్రం ఇంటికి చేరుకొగానే అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. కూలీ పని వద్ద ఎండ దెబ్బ తగలడంతో మృతి చెందాడని ఆయన రోధిస్తూ తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కు మృతిచెందడంతో ఆ కుటుంబం రోడ్డున పడ్డట్టు అయింది. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ త్వరిత గతిన స్పందించి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి రాజేశ్వరరావు, స్థానిక గ్రామ సర్పంచి గైని శ్రీనివాస్, ఉప సర్పంచ్ దాని రాజయ్య, భరోసా గ్రామ కమిటీ అధ్యక్షులు సీనియర్ నాయకులు కిషన్ రావు, జర్నలిస్ట్ గైని శ్రీకాంత్ ఉన్నారు.

