29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

జలమండలి జీఎం లక్ష్మి కుమార్ కు కళ్లు చెదిరే ఆస్తులు

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

రోజుకు ఎన్ని లక్షలు టార్గెట్ పెట్టుకుని సంపాదించాడో… ఒకటా.. రెండా.. ఎన్ని కోట్లు.. ఎన్ని ప్లాట్లు.. వ్యవస్థను జలగలా పట్టేశాడు అనే అంటున్నారు ఇప్పుడు అంతా. అతను ఎవ్వరో కాదు హైదరాబాద్ జలమండలి జనరల్ మేనేజర్ అనంత లక్ష్మి కుమార్. ఆయన పేరులోనే లక్ష్మి ఉంది ఇంకేది నాలుగు రాళ్లు వెనుకేసుకుందామనుకున్నాడో ఏమో కానీ ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని ఫిర్యాదుతో ఎసిబి అధికారులు తనిఖీలు చేసి హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్ బి జనరల్ మేనేజర్ లక్ష్మి కుమార్ ఇంట్లో కళ్లు చెదిరే ఆస్తులు గుర్తించారు. మంగళవారం ఎసిబి వాటర్ బోర్డు జనరల్ మేనేజర్ కుమార్ ఇంటిలో తనిఖీల నిర్వహణ అనంతరం ఎసిబి కోర్టులో హజరు పరుచగా 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైలుకు తరలించారు. జలమండలి జనరల్ మేనేజర్ అనంత లక్ష్మి కుమార్ అయ్యగారి అక్రమ ఆస్తుల చిట్టా ఇదే..మల్లాపూర్‌ నివాసంలో రూ. 1.10 కోట్ల నగదు, 2.1 కిలోల బంగారు ఆభరణాలు, 9.2 కిలోల వెండి వస్తువులు స్వాధినం చేసుకున్నారు.. నిజామాబాద్ జిల్లా నవీపేటలో 3.5 ఎకరాల భూమి, నవీపేటలో కొబ్బరి తోట లొ విలాసవంతమైన ఫామ్‌ హౌస్‌ ను గుర్తించారు. సంగారెడ్డి జిల్లా చేర్యాలలో 13 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్ లో ఇండిపెండెంట్ హౌస్, హైదరాబాద్ లో ప్రముఖ గేటెడ్ కమ్యూనిటీలో 3 ప్లాట్లు, హైదరాబాద్ లోనే 6 ఓపెన్ ప్లాట్లు, రెండు కార్లు, ఒక బైక్ సీజ్ చేశారు. ఇటివలనే కుతూరు పెండ్లీ ఘనంగా నిర్వహించడం విశేషం.

More articles

Latest article