30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

నూర్జహాన్ సంతాప సభను జయప్రదం చేయండి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సీఐటీయు జిల్లా కోశాధికారి ఈవీఎల్ నారాయణ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

అనారోగ్యంతో ఈ నెల 11న మరణించిన నూర్జహాన్ సంతాప సభను ఏప్రిల్ 17 న రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు సిఐటియు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కోశాధికారి ఈవీఎల్ నారాయణ మాట్లాడుతూ నూర్జహాన్ గత రెండున్నర దశాబ్దాల పాటు కార్మిక వర్గ సంక్షేమం కోసం పేద ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడుతూ వారి ప్రయోజనాల కోసం అనేక ఉద్యమాలు నిర్వహించారన్నారు. కార్మికుల పక్షపాతిగా, నిరంతరం కార్మికుల ప్రయోజనాల కోసం పాటుపడిన దీరవనిత అని, ఆమె తమ స్వార్థం కన్నా ప్రజల ప్రయోజనమే మిన్నగా పనిచేస్తారని తెలిపారు. తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజల కోసం పనిచేయటం మూలంగానే ఆమె అనారోగ్యానికి గురయ్యారని, అందువల్ల ఆమెను స్మరించుకోవటానికి ఈ నెల 17న సంతాప సభను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సంతాప సభకు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య, ఎస్.వి.రమ, పి జయలక్ష్మి, రాష్ట్ర కోశాధికారి వంగూరి రాములు, జిల్లా నాయకులు పాల్గొంటారని ఈ సంతాప సభకు జిల్లాలోని అన్ని రంగాల కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆశా వర్కర్ యూనియన్ జిల్లా కార్యదర్శి సుకన్య, అంగడి యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి స్వర్ణ, ఎలక్ట్రిసిటీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు గంగాధర్, వేణుగోపాల్ బార్ధాన్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎస్కే అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article