27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

మద్నూర్ తై బజార్ వేలంపాట

Must read

📰 Generate e-Paper Clip

  • రూ.17 లక్షల 50 వేల 500కు అవర్వార్ హన్మాండ్లు కైవసం

 

మద్నూర్, బతుకమ్మ: మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ తై బజార్ వేలంపాట శనివారం గ్రామపంచాయతీ కార్యాలయంలో పంచాయతీ ప్రత్యేక అధికారి మండల ఎంపీడీఓ రాణి అధ్యక్షతన వేలంపాట నిర్వహించారు. ఈ ఏడాది తై బజార్ వేలం రూ.17 లక్షల 50 వేల 500లకు పాత తైబజార్ కాంట్రాక్టర్ అవర్వార్ హన్మాండ్లు దక్కించుకున్నారు. గత ఏడాది తైబజార్ రూ.13 లక్షల 11 వేలకు పలికింది. ఈ ఏడాది రూ.4,39,500 అధికంగా పలికి సాధించుకున్న తై బజార్ గుత్తేదారు అవర్వార్ హన్మాండ్లు గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందించారు. పంచాయతీ నిబంధనల ప్రకారమే వసూలు జరగాలని, ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడకూడదని తెలియజేశారు. తై బజార్ ద్వారా వచ్చే ఆదాయం నుండి వారం వారం జరిగే సంత వ్యాపారులకు గాని పాత బస్టాండ్ లో ప్రయాణికులకు గాని మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మింపచేయాలని గ్రామస్తులు గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి రాణికి, అలాగే గ్రామ పంచాయతీ కార్యదర్శి సందీప్ కుమార్ లను ప్రత్యేకంగా విన్నవించారు. గ్రామస్తుల విన్నపం మేరకు బస్టాండ్ సమీపంలో మరుగుదొడ్లు మూత్రశాలలు నిర్మింపచేస్తామని అధికారులు గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article