25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

  • రెండు పడక గదుల నిర్మాణంలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరపాలి
  • మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన బిజెపి నాయకులు
  • మాయమైపోతున్న చెరువులను కాపాడాలి
  • అడిషనల్ కలెక్టర్, సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేత

 

బాన్సువాడ, బతుకమ్మ  : బాన్సువాడ పట్టణంలో చేపడుతున్న అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు శనివారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. పట్టణ శివారులో మాయమవుతున్న చెరువులను కాపాడాలని డిమాండ్ చేశారు. కొంతమంది ప్రభుత్వ అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో అవినీతి అక్రమాలు జరిగాయని, వీటిపై విచారణ చేయించాలని డిమాండ్​ చేశారు.కొంతమంది నాయకులు చెరువులు, కుంటలు ఆక్రమించుకుంటుంటే అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. ఈ విషయమై చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి , సబ్ కలెక్టర్ కిరణ్మయికి వినతిపత్రం అందజేశారు. సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అడిషనల్ కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శ్రీనివాస్, శంకర్ గౌడ్, లక్ష్మీనారాయణ, గంగారెడ్డి, హన్మాండ్లు, గోపాల్, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Action should be taken against illegal constructions

More articles

Latest article