. . . నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
హోలీ పండుగ నేపథ్యంలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని పండుగ రోజు వైన్స్ షాపులు మూసి ఉంచాలని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో గల అన్ని గ్రామాలలో సెక్షన్ 20(1) తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్ 1968 ప్రకారంగా కామ దహనము, హోలీ పండుగ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలలో భాగంగా జిల్లాలో గల కళ్ళు దుకాణాలు, కల్లు డిపోలు, ఐ.ఎమ్.ఎల్ (ఎ4) షాప్స్, 2-బి బార్స్, క్లబ్బులు, టిడి-1, సిఎస్ -2 మొదలగునవి ఈ నెల 3 వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి ఈ నెల 5వ తేదీ ఉదయం 6 గంటల వరకు మూసి ఉంటాయని ప్రజలకు తెలియజేశారు.
