34.1 C
Hyderabad

కల్కి భగవాన్ కన్నుమూత

Kalki Bhagavan passes away

Must read

📰 Generate e-Paper Clip

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

తనను తాను కల్కి భగవాన్ గా చెప్పుకున్న ఆధ్యాత్మికవేత్త కన్నుమూశారు. ఆయన వయస్సు 85 ఏళ్లు. కల్కి భగవాన్ అసలు పేరు విజయ్ కుమార్ నాయుడు. ఇటీవల కాలంగా ఆయన తీవ్ర అస్వస్థతో ఉన్నారు. చెన్నైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం బత్తలపల్లం గ్రామంలో ఆయన ఒక ఆలయాన్ని నిర్మించారు. దానికి గోల్డెన్ సిటీ అని పేరు పెట్టారు. ఏకం ఆలయం అని కూడా అంటారు.  అధునాతనంగా అద్భుతంగా విశాలమైన ఈ భవనాన్ని నిర్మించి అక్కడ భక్తులతో కార్యక్రమాలు నిర్వహించేవారు. ఆయనకు విదేశీ భక్తులు కూడా చాలా మంది ఉన్నారు. కల్కి భగవాన్ అంత్యక్రియలు అక్కడే నిర్వహిస్తారు. ఆయన భార్యను కూడా కల్కి భగవాన్ అమ్మ అన్న పేరుతో భక్తులు కొలుస్తారు. కల్కి భగవాన్ కు ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఉన్నారు. కల్కి భగవాన్ పార్ధివదేహాన్ని భక్తుల సందర్శన కోసం ఉంచి ఆలయంలోని అంత్యక్రియలు చేస్తారని తెలిసింది.

More articles

Latest article