25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

ఐడీఓసీలో అధికారికంగా శ్రీపాదరావు జయంతి

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

శాసన సభ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను సోమవారం నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో అధికారికంగా నిర్వహించిన జయంతి వేడుకలకు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో శాసన సభ స్పీకర్ గా శ్రీపాదరావు అందించిన సేవలను స్మరిస్తూ, శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్  అదనపు కలెక్టర్(ఎల్ బి), మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, డి ఆర్ డి ఓ సాయ గౌడ్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి పవన్, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

 

Sripada Rao's birth anniversary officially celebrated at IDOC

 

More articles

Latest article