25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

రాత్రికి రాత్రే  భూ కబ్జా

Must read

📰 Generate e-Paper Clip

👉  800  గజాల భూమిలో వెలిసిన షెడ్డులు 

👉  అసద్ బాబా నగర్ లో భూ కబ్జా యత్నం 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  నిజామాబాద్ నగరంలో మరో భారీ భూకబ్జాకు తెర లేచింది. రాత్రికి రాత్రి కొందరు సుమారు 800 గజాల నుంచి 2000 గజాల స్థలాన్ని చేరబట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న 11వ డివిజన్ లో కబ్జా ప్రయత్నాలు శనివారం రాత్రి ప్రారంభమయ్యాయి. స్థానికంగా అసద్ బాబా నగర్ (నంది గుట్ట వెనుక ప్రాంతం)  మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలను ఆనుకొని ప్రధాన రహదారి వెంట ఉన్న కోట్ల విలువచేసే  స్థలాన్ని రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు షెడ్ లను నిర్మించారు. తెల్లవారి సరికి అక్కడ షెడ్ లు  కనిపించడం రేకులతో ప్రహరీ నిర్మించడంతో స్థానికులు షాక్ గురయ్యారు. గతంలో అక్కడ సంబంధిత భూమి రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ఉందని సరిహద్దులు ఉండడం విశేషం.

Land grab overnight

ఇటీవల ఒక ప్రజా ప్రతినిధి స్థానికంగా మదర్స్ కోసం సంబంధిత భూమిని కేటాయించాలని రెవెన్యూ వారిని కోరగా అది అటవీ ప్రాంతమని సాధ్యం కాదని తేల్చి చెప్పినట్టు సమాచారం. కానీ గుర్తు లేని వ్యక్తులు వడ్డు బ్లాక్ రిజిస్ట్రేషన్ ల పేరిట సంబంధిత భూమి పత్రాలు ఉన్నాయని రాత్రికి రాత్రి దానిని కబ్జా చేయడం కలకలం రేపుతుంది. ఈ విషయంలో మదిలిస్ పార్టీ నాయకులు రెవిన్యూ అధికారులకు ఫిర్యాదుకు సిద్ధమయ్యారు. 11 12 13 డివిజన్లో ప్రభుత్వ స్థలాలను చివరికి పేదలకు కేటాయించిన స్థలాలను కబ్జా చేయడం పరిపాటిగా మారింది. ఇటీవల కాలంలో ప్రస్తుత మేయర్ భర్త శేఖర్ పై దాడి వెనుక భూకబ్జా ఆరోపణలే ఉండటం విశేషం. అటవీ అధికారులు, రెవిన్యూ అధికారులు పట్టించుకుంటే గాని కోట్ల విలువచేసే ప్రభుత్వ స్థలాలు అన్యక్రాంతానికి గురికాకుండా ఉండి అవకాశం ఉంది.

Land grab overnight

More articles

Latest article