నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని ఖలీల్వాడిలో గల మోడ్రన్ పబ్లిక్ స్కూల్ లో 1999-2000 సం. లో ఎస్ఎస్సి పూర్తిచేసిన పూర్వ విద్యార్థులు అపూర్వ కలయిక విజయవంతమైంది. నగరంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్ లో గల ఓ ప్రైవేటు ఫాం హౌస్ లో ఆదివారం ఈ ఆత్మీయ వేడుకను ఘనంగా జరుపుకున్నారు. సుమారు 150 మంది పూర్వ విద్యార్థులు 24 ఏళ్ల ఎడబాటు తర్వాత ఒకే వేదికపై కలవడంతో ఆనందం వెళ్లి విరిసింది. తమకు విద్యాబోధన చేసిన గురువులను ఘనంగా స్వాగతించి ఆశీర్వచనాలు తీసుకున్నారు. వారికి మొక్కలు అందజేసి సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు తార మాట్లాడుతూ బాల్యమిత్రులు ఇంతకాలం తర్వాత కలుసుకోవడం ఆనందదాయకమని అన్నారు. ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డ విద్యార్థులను చూసి అభినందించారు. అనంతరం పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ తమ చిన్ననాటి అనుభూతులను స్మరించుకున్నారు. తదనంతరం ఆటపాటలతో ఆనందోత్సాహాల మధ్య గడిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మురళి, సాయిబాబా, బలవంతరావు, సాయి ప్రసాద్, శకుంతల, విమల, అన్నపూర్ణ, పశుపతి రావు, శ్రీనివాస్, సురేందర్ రావు, శర్మ, చిత్రతో పాటు పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
