29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

గణేష్ ఉత్సవాలకు ఖైరతాబాద్ ప్రసిద్ధి

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ :   దేశంలో గణేష్ ఉత్సవాలకు ఖైరతాబాద్ ప్రసిద్ధి చెందిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఖైరతాబాద్ మహా గణపతిని శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారి తీర్థ ప్రసాదాలను అర్చకులు సీఎంకు అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. 71 ఏళ్ల క్రితం గణేష్ ఉత్సవ సమితి ఒకే ఒక్క అడుగు గణేశుడిని ప్రతిష్టించుకుని ఉత్సవాలను ప్రారంభించిందన్నారు. ఒక్కసారే నిర్వహణ కష్టమైన ఈ రోజుల్లో ఇబ్బందులు వచ్చిన తట్టుకొని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఉత్సవాలను కొనసాగిస్తుందన్నారు. రాష్ట్రంలో గణేష్ మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉత్సవ సమితికి అన్ని విధాలుగా సహకారం అందిస్తామని  పేర్కొన్నారు.

Khairatabad is famous for its Ganesh festivals.

 

More articles

Latest article