నిజామాబాద్, బతుకమ్మ : నగరంలోని బోర్గాం (పి) గ్రామంలో శుక్రవారం సేవా భారతి ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా వాసు జి
పాల్గొని సేవా భారతి చేసే కార్యక్రమాలను వివరించారు.
ఈ కార్యక్రమంలో సేవ భారతి అధ్యక్షులు రిటైర్డ్ ఆర్డీవో వెంకటయ్య,
సేవా భారతి ప్రధాన కార్యాద ర్శి శ్రీనివాస్ రెడ్డి ,మాధవ స్మారక సమితి అధ్యక్షులు మర్రి కృష్ణ రెడ్డి ,వి భాగ్ సేవా ప్రముఖ్ వేణు,
నర్సారెడ్డి, శిక్షకురాలు భవాని,నగర సేవా ప్రముఖులు శ్రీనివాస్,గణేష్ పాల్గొన్నారు.

