గణేష్ ఉత్సవాలకు ఖైరతాబాద్ ప్రసిద్ధి
హైదరాబాద్, బతుకమ్మ : దేశంలో గణేష్ ఉత్సవాలకు ఖైరతాబాద్ ప్రసిద్ధి చెందిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఖైరతాబాద్ మహా గణపతిని శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారి తీర్థ ప్రసాదాలను అర్చకులు సీఎంకు అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. 71 ఏళ్ల క్రితం గణేష్ ఉత్సవ సమితి ఒకే ఒక్క అడుగు గణేశుడిని ప్రతిష్టించుకుని ఉత్సవాలను ప్రారంభించిందన్నారు. ఒక్కసారే నిర్వహణ కష్టమైన ఈ రోజుల్లో ఇబ్బందులు వచ్చిన తట్టుకొని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ...