హైదరాబాద్,బతుకమ్మ : హైదరాబాద్ లో శనివారం వినాయక నిమజ్జనం సందర్భంగా మెట్రో ట్రైన్ టైమింగ్స్ ను అధికారులు పొడిగించారు. తొలి ట్రైన్ శనివారం ఉదయం 6 గంటలకు, చివరి ట్రైన్ అర్ధరాత్రి ఒంటి గంటకు అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి బయలుదేరుతాయని హైదరాబాద్ మెట్రో అధికారులు వెల్లడించారు.
