26.2 C
Hyderabad
Monday, August 3, 2026

మానవ హక్కుల కోసం పోరాడిన యోధుడు జ్యోతి రావు పూలే

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రఘురాం

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

మానవ హక్కుల కోసం పోరాడిన యోధుడు మహాత్మా జ్యోతి రావు పూలే అని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రఘురాం అన్నారు. శనివారం ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతి రావ్ ఫూలే 200వ జయంతి సందర్బంగా నగరంలో సుభాష్ నగర్ సర్కిల్ దగ్గర ఏర్పాటు చేసిన జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలవేసి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల విధానంలో పూలే బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించాడని, జ్ఞాన సంపదకు అందరికి అవకాశం ఇవ్వాలని భావించాడన్నారు. సమాజంలో సగభాగం ఉన్న స్త్రీలు అభివృద్ధి చెందకపోతే సమాజం అభివృద్ధి చెందదని పూలె గట్టిగ నమ్మేవారని, 1848 ఆగష్టు లో బాలికలకు పాఠశాల స్థాపించి స్త్రీ విద్యను ప్రోత్సాహించాడని తెలిపారు. 1873 సెప్టెంబర్ 24న సత్యశోధక సమాజాన్ని పూలె స్థాపించాడని, పూలెని స్ఫూర్తిగా తీసుకొని ఆయన బాటలో నేటి విద్యార్ధి, యువత తమ హక్కుల కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి కుషాల్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి రంజిత్, ఏఐఎస్ఎఫ్ నగర నాయకులు నిఖిల్, దిలీప్, నీరజ్, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article