29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య డిమాండ్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, వారి న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని నాలుగు  రోజులుగా చేస్తున్నటువంటి సమ్మెకు మద్దతుగా సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టిజన్ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీ మేరకు ఆర్టిజన్ ఉద్యోగులను, కార్మికులను రెగ్యులరైజ్ చేయకుండా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, రోజు వారీగా పని చేస్తున్నటువంటి కార్మికులను ఉద్యోగ భద్రత కల్పించకుండా ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా అన్యాయం చేయడం తగదని అన్నారు. వెంటనే ఆర్టిజన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

More articles

Latest article