రుద్రూర్, బతుకమ్మ : బాన్సువాడలో ఎన్ని సమస్యలు ఉన్నా వాటికి పరిష్కారాలు చూపించడానికి ప్రయత్నిస్తానని, అందుకే బిజెపి పార్టీలోకి చేరానని కోనేరు శశాంక్ అన్నారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) బాన్సువాడ నియోజకవర్గంలో కోనేరు శశాంక్ బీజేపీ పార్టీలో చేరటం తో కార్యకర్తలలో కొత్త ఉత్సహం నింపుకున్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయనకు శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఆయన రాకతో బాన్సువాడ బీజేపీ బలోపెతం అవుతుందని బీజేపీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. శశాంక్, యువతలో అభివృద్ధి, సంక్షేమం, ప్రజల సమగ్ర పరిష్కారాలకు కృషి చేస్తున్న నాయకుడని బీజేపీ కార్యకర్తలు, నాయకులు పేర్కొన్నారు. బీజేపీ బాన్సువాడ నియోజకవర్గంలో కోనేరు శశాంక్ బీజేపీలో చేరిన సందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకి ఘనంగా స్వాగతం పలికారు. భారతీయ జనతా పార్టీ ఈ కొత్త తరగతికి ఆదర్శంగా నిలుస్తోంది. శశాంక్ మరింత ప్రజా సంబంధాలను పెంచి, బాన్సువాడ అభివృద్ధికి నూతన దిశను చూపిస్తారని బీజేపీ కార్యకర్తలలో నమ్మకం ఉంచామన్నారు. ఈ సందర్బంగా కోనేరు శశాంక్ మాట్లాడుతూ.. ప్రజల సేవకు నేను నూతన ఉత్సాహంతో సన్నద్ధం ఉన్నానని అన్నారు. బాన్సువాడలో ఎన్ని సమస్యలు ఉన్న వాటికి పరిష్కారాలు చూపించడానికి ప్రయత్నిస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ బాన్సువాడ కన్వినర్ గుడుగుట్ల శ్రీనివాస్, రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, బాన్సువాడ నియోజకవర్గం అన్ని మండలాల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
