తెలంగాణ హితం కోసమే బీఆర్ఎస్ లో చేరాను

0 11,256

 

. . . తెలంగాణ సీనియర్ నేత జీవన్ రెడ్డి

 

జగిత్యాల, బతుకమ్మ :

 

తెలంగాణ హితం కోసమే బీఆర్ఎస్ లో చేరాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలంగాణ సీనియర్ నేత జీవన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ కి వెన్నె ముక్క గా, జగిత్యాల నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా పేరున్న సీనియర్ నేత టి.జీవన్ రెడ్డి సోమవారం బీఆర్ఎస్ లో చేరారు. సోమవారం జగిత్యాల లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జీవన్ రెడ్డి కి పార్టీ కండువా కప్పి ఆయనని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయల్లో అపార అనుభవం ఉన్న జీవన్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. జీవన్ రెడ్డి రాకతో ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ కి భారీ బలం చేకూరినట్టయింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ముఖ్యనేతలు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.