. . . జగిత్యాల సభలో నిప్పులు చెరిగిన కేసిఆర్
జగిత్యాల, బతుకమ్మ:
రైతు బంధు, ధళిత బంధులను పట్టించుకోకుండా రైతులను, పేదలను ఎడిపిస్తున్న ప్రభుత్వ పెద్ధలు పాలన గాలీకి వదిలేసీ కేసిఆర్ చావాలని కోరుకుంటున్నారు అని మాజీ సీయం, బిఆర్ఎస్ అదినేత కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి బిఆర్ఎస్ లో చెరిక సంధర్బంగా గులాబి పార్టి ప్రజా అశీర్వాధ సభ నిర్వహించింది. ఈ సభలో మాజీ సీయం కేసిఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ… తెలంగాణ గడ్డపై గంజి కేంద్రాలు నడిచిన రోజులను చూశానని, బషీర్ బాగ్ లో కరేంటు కోసం పిల్లలను కాల్చి చంపితే చలించి ఉద్యమానికి వచ్చానని గుర్తు చేసుకున్నరు. తనను బాడి షేమింగ్ చేసిన, హేళన చేసిన రాష్ట్రమంత తిరిగి అందరిని కుడగట్టి తెలంగాణ సాదించానని కేసిఆర్ అన్నారు . తెలంగాణ రాకముందు దుస్థితిని గుర్తు చేస్తు పాలమూరు నుంచి 90 శాతం వలసలు ఉండేవని, తెలంగాణలో ప్రజలు తిండిలేక, పని లేక దేశాలు దాటి వేళ్లారని అవేధన వ్యక్తం చేశారు. పదేళ్ళ పాలనలో ఇంటింటికి మంచినీళ్లు, 24 గంటల కరేంట్ ఇచ్చి తెలంగాణను దేశంలో అగ్రగామిగా నిలిపామన్నారు. కాంగ్రెస్ పార్టి అధికారంలోకి రావాడానికి ప్రజలకు అలవికాని హమీలు ఇచ్చిందని తులం బంగారం , స్కూటిలు, పెంచిన పెన్షన్ లు, జాబ్ క్యాలండర్ ఎమైందని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రజా క్షేమం మరిచి కేసిఆర్ చావును కోరుకుంటుందని.. వెయ్యి జన్మలెత్తిన నెను చావను కోడుకా అంటు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో డేవలప్ మెంట్ ముచ్చట లేదని, పాలకుల చిల్లర మాటాలు తప్ప రాష్ట్రంలో ఎమి జరుగడం లేదని అన్నారు. మొన్నటి ఎన్నికలలో 1.7 శాతం ఒట్ల తేడాతో ఓటమి చెందామని, రాబోయే ఎన్నికలలో బిఆర్ఎస్ విజయం ఖాయమని దీమా వ్యక్తం చేశారు..ప్రజలు కాంగ్రెస్ పార్టి చేసిన అబద్ధపు హమీలను గుర్తించి అపార్టి నైజాన్ని గ్రహిస్తున్నరని అన్నారు. మళ్లి బరాబర్ మనమే అధికారంలోకి … ఈ సారీ బంపర్ మెజార్టీతో గెలుస్తామని దిమా వ్యక్తం చేశారు.
