. . . తన బండారం బట్ట బయలు అవుతుందని జగిత్యాల లో కేసీఆర్ సభ
. . . కేసీఆర్ , కేటీఆర్ హరీష్ రావు లను జైల్లో పెడతామని బీజేపీ ప్రగల్బాలు పలికింది
. . . సీఎం రేవంత్ రెడ్డి
మేడిగడ్డ, బతుకమ్మ :
నీటి లభ్యత, ప్రాజెక్టు నిర్మాణానికి అనుకూలమని ఆనాడు వైఎస్ ఆర్ తుమ్మడి హెట్టి దగ్గర ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును శ్రీకారం చుడితే కేసీఆర్ ఆర్థిక ప్రయోజనం లేదని సాకుతో అంచనా వ్యయాన్ని లక్ష కోట్లకు పెంచి కాళేశ్వరం నిర్మించారని అది తప్పిదమని ప్రకృతి బయటపెట్టిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. సోమవారం జయశంకర్ భూపాల పల్లి జిల్లాలో మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన పిల్లర్లను సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు నీటి పారుదల శాఖ అధికారులు పరిశీలించారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ డా. బి ఆర్ అంబేద్కర్ ప్రాణ హిత చేవేళ్ల సుజల స్రవంతి పథకాన్ని రీ డిజైన్ పేరుతో కాళేశ్వరంగా మార్చి కోట్ల రుపాయల వ్యయాన్ని పెంచి ప్రాజెక్టు నిర్మాణం అధ్భుతమని అందరిని బ్రమల్లో ముంచారని అందుకే 2023 అక్టోబర్ లో మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయాయని అన్నారు. లక్ష కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నెల రోజుల ముందే మేడిగడ్డ ప్రాజెక్టు పరిశీలన కార్యక్రమాన్ని తన అవినీతి బండారం బయటపడుతుందని కేసీఆర్ జగిత్యాల లో రాజకీయ సభ పెట్టారని ఎద్దెవా చేశారు. కాళేశ్వరం అవినీతి పై కేంద్రం విచారణ కు ఆదేశిస్తుందని హరీష్ రావు బీజేపీ పెద్దల కాళ్లు పట్టుకోవడానికి ఢిల్లీ వెళ్లారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో బీజేపీ నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ల అవినీతిపై మాట్లాడారని వారిపై ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి జైలుకు పంపుతామని ప్రగల్భాలు పలికారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సార్లు సీబీఐ కి లేఖలు రాసిన ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్దరునపై కాంగ్రెస్ ప్రభుత్విం చిత్త శుద్దితో ఉందని సీఎం స్పష్టం చేశారు. తాము ఇప్పటికే సాంకేతిక నిపుణులు, మూడు నిర్మాణ సంస్థల ప్రతి నిధులతో చర్చించామని, శాస్త్రీయ పద్దతిలో మరమ్మతులు మొదలు పెట్టామని వెల్లడించారు. ఈ పర్యటనలో మంత్రులు, ఇరిగేషన్ నిపుణులు పాల్గొని బ్యారెజీ స్థితి గతులను నిశితంగా పరిశీలించారు.
