26.3 C
Hyderabad
Monday, August 3, 2026

ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ పట్టాభిషేక ఉత్సవాలు

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

ఇందూర్ ముఖద్వారం వద్ద ఉన్న శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం సమీపంలో హిందూ పట్టాభిషేక ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆదివారం శివాజీ మహారాజ్ సేవాసమితి ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించగా, స్థానిక ప్రజలు, యువత, సేవాసమితి సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివాజీ మహారాజ్ సేవాసమితి అధ్యక్షులు శివాజీ లక్ష్మణ్ మాట్లాడుతూ, ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేకం హిందూ సమాజానికి అత్యంత పవిత్రమైన చారిత్రక ఘట్టమని అన్నారు. ప్రతి హిందువు ఈ రోజును గౌరవంగా జరుపుకోవాలని, ముఖ్యంగా యువత శివాజీ మహారాజ్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని దేశభక్తి, ధైర్యసాహసాలు, నాయకత్వ లక్షణాలను అలవరచుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే కేంద్ర ప్రభుత్వం పాఠశాలల పాఠ్యాంశాల్లో శివాజీ మహారాజ్ చరిత్రకు సంబంధించిన సుమారు 20 పేజీల సమాచారాన్ని చేర్చడం అభినందనీయమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామం, మండలం, జిల్లా స్థాయిలో శివాజీ మహారాజ్ సేవాసమితి ఆధ్వర్యంలో వివిధ అవగాహన, సాంస్కృతిక, చారిత్రక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అబదాస్ రావు, ఏ. రాజా రెడ్డి, డాక్టర్ రామ్మోహన్, రాజేష్ తివారి, మల్లేష్, మనోజ్ మాస్టర్, శ్రీనివాస్, భరత్ రాజ్, దుర్గాప్రసాద్ దిగంబరు, విజయ్ కుమార్, ముజే భాస్కర్ రావు, అర్జున్ రెడ్డి, చందు అన్న, హరీష్, కార్తీక్, నాగరాజ్ అన్న, రేవంత్ అన్న, ప్రణయ్ తదితర సేవాసమితి సభ్యులు, పెద్దలు, స్థానికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

 

Grand celebrations of Chhatrapati Shivaji Maharaj's Hindu coronation.

More articles

Latest article