ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ పట్టాభిషేక ఉత్సవాలు

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   ఇందూర్ ముఖద్వారం వద్ద ఉన్న శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం సమీపంలో హిందూ పట్టాభిషేక ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆదివారం శివాజీ మహారాజ్ సేవాసమితి ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించగా, స్థానిక ప్రజలు, యువత, సేవాసమితి సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివాజీ మహారాజ్ సేవాసమితి అధ్యక్షులు శివాజీ లక్ష్మణ్ మాట్లాడుతూ, ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేకం హిందూ సమాజానికి అత్యంత పవిత్రమైన చారిత్రక ఘట్టమని అన్నారు. ప్రతి హిందువు...