27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

పోలియో రహిత భారతదేశం మన లక్ష్యం..

Must read

📰 Generate e-Paper Clip

 

. . . తెలంగాణ జిల్లా గౌరవాధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

పోలియో రహిత భారత దేశమే మనందరి లక్ష్యమని పీఆర్ టియు తెలంగాణ జిల్లా గౌరవాధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి అన్నారు. ఆదివారం ప్రారంభించిన పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో భాగంగా నగరంలోని 50 వ డివిజన్ ప్రభుత్వ ఐటిఐ లో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేయించే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు సంవత్సరాలలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, పోలియో రహిత భారత దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ప్రతి తల్లిదండ్రులను కోరారు. 0-5 ఏళ్లలోపు 36.10 లక్షల మంది చిన్నారులకు రెండు చుక్కల బైవేలెంట్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ వేయనున్నారు.

More articles

Latest article