నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో గ్రామ పంచాయితీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లను ఖరారు చేశారు. 545 గ్రామ పంచాయితీల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. 545 గ్రామ పంచాయితీలకు సంబంధించిన వార్డు మెంబర్లను కూడా ఖరారు చేశారు. మొత్తం 545 పంచాయితీలలో 5022 వార్డులకు రిజర్వేషన్లను ఒకే చేశారు. వంద శాతం ఎస్టీలు ఉన్న గ్రామ పంచాయితీల్లో 71గా గుర్తించి అందులో 33 మహిళలకు, 38 అన్ రిజర్వుగా గుర్తించారు. అందులో 266 వార్డులకు మహిళలకు 266 వార్డులను జనరల్ గా నోటిఫై చేస్తూ మొత్తం 532 వార్డుల రిజర్వేషన్లు ఒకే చేశారు. ఎస్టీలు ఎక్కువగా ఉన్న 25 గ్రామాలలో 8 మహిళలకు 17 అన్ రిజర్వుగా ప్రకటించారు. అందులోనే 304 వార్డులలో 98 మహిళలకు, 206 జనరల్ కేటగిరిగా నిర్ణయించారు. ఎస్సీలకు 82 పంచాయితీలు కేటాయించగా 35 మహిళలకు 47 అన్ రిజర్వుడ్ గా ప్రకటించారు. ఎస్సీలకు కేటాయించిన పంచాయితీలలో 808 వార్డులకు 301 మహిళలకు, 507 జనరల్ గా ఖరారు చేశారు. జిల్లాలో 125 బీసీలకు పంచాయితీలో రిజర్వుగా చేయగా అందులో 70, జనరల్ కేటగిరిలో 55 మహిళలకు కేటాయించారు. బీసీలకు కేటాయించిన పంచాయితీలలోని 1107 వార్డులలో 670 అన్ రిజర్వుగా, 437 మహిళలకు కేటాయించారు. జిల్లాలో 242 పంచాయితీలను ఓపెన్ కేటగిరిగా నిర్ణయించారు. అందులో 129 అన్ రిజర్వుడ్ గా, 113 మహిళలకు పోటీ చేసే అవకాశం కల్పించారు. 242 అన్ రిజర్వుడ్ పంచాయితీల్లోని 2271 వార్డులలో 1050 మహిళలకు, 1221 జనరల్ గా కేటాయించారు.