మెండోరా, బతుకమ్మ: మెండోరా మండలం వెల్కటూర్ గ్రామానికి చెందిన షేక్ మస్తాన్ విద్యుత్ షా తగిలి చనిపోయినట్లు మెండోరా ఎస్సై సుహాసిని తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం వెల్గటూర్ గ్రామానికి చెందిన షేక్ మస్తాన్ (59) వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు, సోమవారం ఉదయం పొలం లో గల మోటార్ స్టార్ట్ చేయ బోగా అక్కడ ట్రాన్స్ఫార్మర్ నుండి మోటార్ స్టార్టర్ డబ్బాకి వచ్చే వైర్ తెగి ఉంది అట్టి వైర్ స్టార్టర్ కి తగిలి ఉండగా మస్తాన్ కి కరెంటు షాక్ తగిలి చనిపోయాడు. ఇట్టి విషయం పై అతని కొడుకు షేక్ సలీం విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం తో తన తండ్రి చనిపోయినట్టు ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తుచ చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
