గ్రామ పంచాయితీ రిజర్వేషన్లు ఖరారు
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో గ్రామ పంచాయితీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లను ఖరారు చేశారు. 545 గ్రామ పంచాయితీల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. 545 గ్రామ పంచాయితీలకు సంబంధించిన వార్డు మెంబర్లను కూడా ఖరారు చేశారు. మొత్తం 545 పంచాయితీలలో 5022 వార్డులకు రిజర్వేషన్లను ఒకే చేశారు. వంద శాతం ఎస్టీలు ఉన్న గ్రామ పంచాయితీల్లో 71గా గుర్తించి అందులో 33 మహిళలకు, 38 అన్ రిజర్వుగా గుర్తించారు. అందులో 266 వార్డులకు...