28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం 

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, ఆర్మూర్ :  నిజామాబాద్,ఆదిలాబాద్, కరీంనగర్ ,మెదక్ ల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటును నమోదు చేసుకోవాలని బీసీ ఉద్యమ నాయకులు, తెలంగాణ ఉద్యమ నాయకులు అబ్బగోని అశోక్ గౌడ్ పిలుపునిచ్చారు..
త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు పట్టభద్రులు నిరుద్యోగులు, తమ ఓటును ఆన్లైన్లో కానీ లేదా ఆఫ్లైన్లో కానీ నమోదు చేసుకోవాలని తెలియజేశారు. 2021 నవంబర్ లోపు డిగ్రీ పూర్తి చేసిన వారు ఎమ్మెల్సీ ఓటుకు అర్హులని తెలిపారు. పట్టభద్రుల ఓటర్ల ఫారం నెంబర్-18 నందు తమ వివరాలు పొందుపరచాలని తెలియజేశారు. ఆన్లైన్ కొరకు https://ceotserms2.telangana.gov.in/MLC/search.aspx లో దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు.
వివరాలకు నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ కేంద్రంలో గల పెర్కిట్ నందు గల శ్రీ వైష్ణవి అసోసియేషన్ ఆఫ్ కన్సల్టెన్సీ లొ కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు.  దీనిని పట్టభద్రులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఎమ్మెల్సీ ఓటు నమోదు కొరకు కావాల్సిన పత్రాలు డిగ్రీ మెమో లేదా ప్రొవిజినల్స్ సర్టిఫికెట్, ఓటర్ ఐడి కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డు ఉండాలని తెలిపారు. చివరి తేదీనవంబర్ 6 వరకు ఉందని తెలియజేశారు.ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే తమ సమీపంలో ఉన్నతహసిల్దార్ కార్యాలయం లో సంప్రదించవచ్చని తెలియజేశారు.

More articles

Latest article