మోర్తాడ్, బతుకమ్మ : మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్ అన్నారు.
మంగళవారం మోర్తాడ్ లోని తక్కురీ వాడలో నిర్వహించిన బాల్కొండ నియోజకవర్గస్థాయి మహిళా సంఘాల వడ్డీ లేని రుణాల రాయితీ పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. నిజామాబాద్ జిల్లాలోని మహిళలు ప్రభుత్వ పథకాలను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో మహిళా సంఘ ప్రతినిధులు ముందుండి అన్ని ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణం తాగునీటి వసతి విద్యుత్ సౌకర్యం వంటి ఎన్నో పనులను నిర్ణీత వ్యవధిలో వేగంగా పూర్తి చేశారని గుర్తు చేశారు. మహిళా సంఘాల ద్వారా ఐకెపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని వీటిని కూడా మహిళలు చక్కగా నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన కమ్మర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నరసయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. ఇందిరమ్మ పేరుతో నాణ్యమైన చీరలను సైతం అందించడం జరిగిందని పేర్కొన్నారు. అనంతరం నియోజకవర్గ పరిధిలోని మహిళా సంఘాల ప్రతినిధులకు రూ.6.33 కోట్ల విలువైన వడ్డీ రాయితీ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో కమ్మర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముత్యాల రాములు, మోర్తాడ్ ఎంపీడీవో తిరుమల దేవి, డిఆర్డిఏ డిపిఎం రాజేశ్వర్ టీఎన్జీవో జిల్లా ఉపాధ్యక్షుడు బత్తుల మాణిక్యం, నియోజకవర్గ పరిధిలోని ఏపీఎంలు కుంట గంగాధర్, శ్యామ్, కిరణ్, ప్రమీల, గంగారాం, గంగరాజు హిమబాల, సీసీ లు, తడకల శ్రీనివాస్. కుంట శ్రీనివాస్, మహేందర్, గాజుల శ్రీనివాస్ , సంతోష్, గంగాధర్ గంగలలిత, ప్రసాద్, మహిళా సమాఖ్య సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మహిళలకు ప్రభుత్వం పెద్దపీట
