మహిళలకు ప్రభుత్వం పెద్దపీట

మోర్తాడ్, బతుకమ్మ :  మహిళలకు  రాష్ట్ర ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్ అన్నారు. మంగళవారం మోర్తాడ్ లోని తక్కురీ వాడలో నిర్వహించిన బాల్కొండ నియోజకవర్గస్థాయి మహిళా సంఘాల వడ్డీ లేని రుణాల రాయితీ పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి  మాట్లాడారు.  నిజామాబాద్ జిల్లాలోని మహిళలు ప్రభుత్వ పథకాలను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో మహిళా సంఘ ప్రతినిధులు ముందుండి అన్ని ప్రభుత్వ పాఠశాలలో...